RBI: ఆర్బీఐ క్విజ్... ఫస్ట్ ప్రైజ్ రూ.10 లక్షలు!

rbis quiz for Degree students offers a chance to win rs 10 lakh
  • ఆర్‌బీఐ 90వసంతాల వేళ డిగ్రీ విద్యార్ధులకు గుడ్ న్యూస్ 
  • దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ ప్రక్రియలో క్విజ్ పోటీలు 
  • విజేతలకు భారీగా నగదు బహుమతులు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 90 వసంతాల వేళ డిగ్రీ విద్యార్ధులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. భారీ ప్రైజ్ మనీతో డిగ్రీ విద్యార్ధులకు ఆర్బీఐ క్విజ్ పోటీలను నిర్వహిస్తోంది. ఈ క్విజ్ పోటీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆసక్తి కల్గిన విద్యార్ధులు ఈ నెల (సెప్టెంబర్) 17 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీల్లో ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. 

విద్యార్ధుల్లో దేశ ఆర్ధిక వ్యవస్థ, రిజర్వు బ్యాంకు గురించి అవగాహన, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 1నాటికి 25ఏళ్ల లోపు వయసు ఉండి ఏదైనా డిగ్రీ చదువుతున్న విద్యార్ధినీ విద్యార్ధులు పోటీలకు అర్హులు. దేశ వ్యాప్తంగా నాలుగు దశల్లో ఆన్ లైన్ ద్వారా నిర్వహించే ఈ క్విజ్ పోటీల విజేతలకు ప్రైజ్ మనీతో సర్టిఫికెట్ అందజేస్తారు. జోనల్ స్థాయిలో సత్తా చాటిన వారికి జాతీయ స్థాయిలో ఫైనల్ రౌండ్ నిర్వహిస్తారు. 

జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన మొదటి ముగ్గురు విజేతలకు రూ.10 లక్షలు, రూ.8 లక్షలు, రూ.6 లక్షలు చొప్పున ప్రైజ్ మనీ అందిస్తారు. ఇక జోనల్ స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.5లక్షలు, రూ.4లక్షలు, రూ.3లక్షలు చొప్పున ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో వరుసగా రూ.2లక్షలు, లక్షన్నర, లక్ష చొప్పున నగదు బహుమతి అందిస్తారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి https://www.rbi90quiz.in/
RBI
RBI Quiz
National news

More Telugu News