ఏపీ వరదలు.. వాహనదారులకు సర్కారు ఊరట
- బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలతో చంద్రబాబు సమావేశం
- వాహనదారుల క్లెయింలను వేగంగా పరిష్కరించాలని సూచన
- మరమ్మతుల భారం తగ్గించాలని కోరిన సీఎం
నీట మునిగిన వాహనాలు, కొట్టుకుపోయిన వాహనాలకు సంబంధించిన క్లెయింలను వేగంగా పరిష్కరించి బాధితులను ఆదుకోవాలన్నారు. బ్యాంకుల ప్రతినిధులతోనూ భేటీ అయిన సీఎం.. వాహనాల లోన్లను రీషెడ్యూల్ చేయాలని కోరారు. ప్రభుత్వంతో కలిసి బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రూల్స్ కు కొన్ని సడలింపులు చేసి ప్రజలకు కొత్త రుణాలను మంజూరు చేయాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్లెయింల దరఖాస్తుకు అవకాశం కల్పించాలని బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు.