Cricket: భారత్ తో టెస్టు సిరీస్... బంగ్లాదేశ్ కోరిక నెరవేరేనా?

bangladesh is desperate to beat india for 24 years
  • రోహిత్ శర్మ నేతృత్వంలో బంగ్లాదేశ్ తో జట్టు సిరీస్ లో తలపడేందుకు సిద్దమయిన టీమిండియా
  • పాకిస్థాన్ ను వరుసగా రెండు టెస్టుల్లో ఓడించి రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ ..భారత్ పై గెలుపునకు తహతహ
  • 24 ఏళ్లుగా విజయం కోసం బంగ్లాదేశ్ ఎదురుచూపు
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో తలపడేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా సిద్ధమయింది. స్వదేశంలో పాకిస్థాన్ ను వరుసగా రెండు టెస్టుల్లో ఓడించి చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ ..అదే ఊపుతో భారత్ లో సిరీస్ విజయం కోసం ఆశపడుతోంది. భారత్ పై బంగ్లాదేశ్ జట్టు ఇప్పటి వరకూ టెస్టులో విజయం సాధించలేకపోయింది. దీంతో భారత్ పై విజయం సాధించాలంటే బంగ్లాదేశ్ శాయశక్తులా ప్రయత్నించాల్సి ఉంటుంది. 2000 సంవత్సరం నుండి ఇరు జట్లు టెస్ట్ లో తలపడతున్నా టీమిండియాపై బంగ్లాదేశ్ విజయం సాధించలేకపోయింది. పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ సజ్ముల్ హుస్సేన్ శాంటో ఇప్పుడు భారత్ లో సిరీస్ విజయంపై దృష్టి పెట్టారు. భారత్ లో తమ జట్టు ఇదే ప్రదర్శనను పునరావృతం చేయాలని కోరుకుంటున్నట్లు శాంటో తెలిపారు. 
 
ఇరుదేశాల మధ్య 11 టెస్టులు జరగ్గా, 11 టెస్టుల్లో టీమిండియా విజయం సాధించింది. రెండు మ్యాచ్ లు డ్రా అయ్యాయి. ఇక  బంగ్లాదేశ్ తో భారత్ ఇప్పటి వరకూ 14 టీ 20 మ్యాచ్ లు ఆడింది. భారత జట్టు 13 మ్యాచ్ లు గెలుపొందగా, బంగ్లాదేశ్ కేవలం ఒక మ్యాచ్ లో గెలుపొందింది. వన్డేలో ఇరు జట్లు 41 సార్లు తలపడగా, భారత్ 32 మ్యాచ్ లో విజయం సాధించింది. బంగ్లాదేశ్ 8 మ్యాచ్ ల్లో గెలవగా, ఒక వన్డే అసంపూర్తిగా మిలిగిపోయింది.  
 
 
Cricket
India
Bangladesh
Sports News

More Telugu News