USA: ఉక్రెయిన్-రష్యా వివాదం పరిష్కారానికి సిద్ధంగా ఉన్న ఏ దేశాన్నైనా స్వాగతిస్తాం: అమెరికా

United States welcomes any nation that is willing to help in ending the conflict between Russia and Ukraine
  • ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటన నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన
  • ఉక్రెయిన్ ప్రజల హక్కులకు అనుగుణంగా పనిచేయాలని పిలుపు
  • ఇటీవలే మోదీతో ఫోన్‌లో మాట్లాడిన అధ్యక్షుడు బైడెన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా కీలక ప్రకటన విడుదల చేసింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య వివాదానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్న ఏ దేశానికైనా స్వాగతం పలుకుతామని పేర్కొంది. ఉక్రెయిన్ ప్రజల ప్రత్యేక హక్కులు, శాంతిని కోరుకుంటున్న అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అనుగుణంగా కృషి చేయాలని, అలాంటి పాత్ర పోషించే దేశాన్ని తాము కచ్చితంగా స్వాగతిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీతో అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు కదా? అని మీడియా ప్రశ్నించగా కిర్బీ ఈ సమాధానం ఇచ్చారు.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో చారిత్రాత్మక పర్యటన చేశారు. ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. రష్యాతో వివాదం ముగింపునకు భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. కాగా మోదీ ఉక్రెయిన్ నుంచి వచ్చిన తర్వాత ఆయనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేసి మాట్లాడారు.
USA
Ukraine
Russia
White House

More Telugu News