ప్రకాశం బ్యారేజీకి తగ్గిన వరద.. శాంతించిన బుడమేరు.. ఊపిరి పీల్చుకుంటున్న విజయవాడ ప్రజలు
- ప్రకాశం బ్యారేజీ వద్ద 9.5 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం
- విజయవాడలో తగ్గుముఖం పట్టిన వరద
- ఆహార పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసిన ప్రభుత్వం
మరోవైపు బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకు బుడమేరు మహోగ్రరూపం దాల్చించి. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వదర నీరు వచ్చింది. దీని ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లు నీట మునిగాయి. దాదాపు 2.59 లక్షల మంది నీటిలోనే ఉండిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టడంతో బెజవాడవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరోవైపు వరద బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది.