సరికొత్త వందేభారత్ రైళ్లలో ఈ ఫీచర్లు గమనించారా?
- త్వరలో పట్టాలెక్కనున్న వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్
- బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో వందేభారత్ స్లీపర్ వెర్షన్ రైలును పరిచయం చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
- సౌకర్యం, రక్షణ, కొత్తదనానికి చిరునామాగా ఉంటాయని వెల్లడించిన కేంద్ర మంత్రి
దూర ప్రాంతాలకు వెళ్లే వారి (లాంగ్ జర్నీ) కోసం ఈ రైలును తెస్తున్నారు. వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు ఏమిటంటే.. ఇది గంటకు 160 కిలో మీటర్ల వేగంతో వెళుతుంది. ఈ రైలుకి 16 కోచ్ లు ఉంటాయి. వీటిలో 11 ఏసీ త్రీ టైర్, 4ఏసీ టూ టైర్, 1 ఏసీ ఫస్ట్ క్లాస్ ఉంటాయి. మొత్తం 823 ప్రయాణీకుల బెర్తులు ఉంటాయి. ఈ రైలులో అడ్వాన్స్డ్ లైటింగ్ అదిరిపోతుంది. యూఎస్ బీ చార్జింగ్ ఉంటుంది. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రత్యేకంగా డాగ్ బాక్స్ కూడా ఉంటుంది. ప్రతి డైనింగ్ ట్రైలర్ కోచ్ లో లగేజ్ ఉంచుకోవడానికి ఎక్కువ స్థలం (స్పేస్) ఉంటుంది.
ఈ రైలులో భారీ, మీడియం, స్మాల్ పాంట్రీస్ లో తాజా లంచ్, డిన్నర్ అందుబాటులో ఉంటుంది. తినేందుకు వీలుగా రైలులో స్థిరమైన, మడతపెట్టేందుకు వీలుగా ఉండే స్నాక్ టేబుల్స్ ఉంటాయి. అందువల్ల డైనింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈఎస్ 45545 ప్రకారం అగ్ని భద్రత, ప్రమాదాలను నిరోధించే సదుపాయం ఉంది. దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక బెర్త్‌లు, టాయిలెట్లు, ఆటోమేటిక్ బాహ్య ప్రయాణీకుల తలుపులు, సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ తలుపులు, ఎండ్ వాల్ వద్ద రిమోట్ గా పని చేసే ఫైర్ బారియర్ డోర్లు, సమర్థతాపరంగా రూపొందించిన వాసన లేని టాయిలెట్ వ్యవస్థ, పబ్లిక్ ప్రకటన – దృశ్య సమాచార వ్యవస్థ వంటి ఫీచర్ లు ఈ ట్రైన్ లో ఉన్నాయి.