కూల్చివేతలు ఆపిన హైడ్రా.. కారణం ఇదే!
--
వర్షాలకు నీట మునిగిన ప్రాంతాల్లో రంగనాథ్ పర్యటిస్తున్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటల పక్కనే ఉన్న కాలనీలలో పర్యటిస్తూ, స్థానికులను అడిగి అక్కడి పరిస్థితికి కారణాన్ని తెలుసుకుంటున్నారు. చెరువుల పక్కన నిర్మించిన కాలనీలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలోని అక్రమ నిర్మాణాలకు ఇరిగేషన్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. వారం రోజుల్లోగా ఇళ్లు ఖాళీ చేయాలని అందులో హెచ్చరిస్తున్నారు.