21 రైళ్ల రద్దు.. 12 దారి మళ్లింపు.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల వేళ రైల్వే కీలక నిర్ణయం
- భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
- పలు చోట్ల పట్టాలపై నీరు నిలిచిందని వెల్లడి
- కేసముద్రం-మహబూబాబాద్ మధ్య రైల్వే ట్రాక్ దెబ్బతిందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఇవాళ (సోమవారం) రద్దయిన 21 రైళ్ల జాబితాలో కాకినాడ పోర్ట్-లింగంపల్లి, సికింద్రాబాద్ -గూడూరు, బీదర్-మచిలీపట్నం, మచీలిపట్నం-బీదర్, విజయవాడ-సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్‌తో పాటు పలు రైళ్లు ఉన్నాయి.
ఇక దారి మళ్లించిన 12 రైళ్ల జాబితాలో 12763 తిరుపతి-సికింద్రాబాద్, 22352 ఎస్ఎంవీటీ బెంగళూరు-పాట్లీపుత్ర, 22674 మన్నార్గుడి-భగత్ కి కోతీ, 20805 విశాఖపట్నం-న్యూఢిల్లీ, విశాఖపట్నం-ముంబై, బీదర్-మధురైతో పాటు పలు రైళ్లు ఉన్నాయి. కాగా ప్రయాణికులకు అదనపు సమాచారం కోసం రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది. హైదరాబాద్-27781500, వరంగల్-2782751, కాజీపేట-27782660, ఖమ్మం-2782885 నంబర్లను సంప్రదించవచ్చునని సూచించింది.