అమరావతి పనులు స్టార్ట్ అవుతున్నాయ్... ఇంకా 3,558 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయాలి
- అమరావతి రైతులకు రూ. 175 కోట్లను గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిందన్న నారాయణ
- సెప్టెంబర్ 15లోగా చెల్లిస్తామని వెల్లడి
- విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులను రెండు దశల్లో చేపడతామన్న మంత్రి
విజయవాడ, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులు ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్నాయని నారాయణ తెలిపారు. ఈ రెండు మెట్రో రైల్ ప్రాజెక్టులను రెండు దశల్లో చేపట్టాలని భావిస్తున్నామని చెప్పారు. అమరావతిలో రూ. 160 కోట్లతో సీఆర్డీయే ప్రధాన కార్యాలయ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యాలయంలోనే అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్, సీఆర్డీయే, మున్సిపల్ శాఖ, టిడ్కో తదితర కార్యాలయాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అమరావతిలో ఇంకా 3,558 ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేయాల్సి ఉందని తెలిపారు.