జగన్ కోసం నేను చేసిన త్యాగాల మాటేమిటి?: విమర్శకులకు మోపిదేవి ఎదురు ప్రశ్న
- 'ఓడినా ఎమ్మెల్సీ ఇచ్చాం, మంత్రి పదవి ఇచ్చాం' అనడంపై మోపిదేవి ఫైర్
- రాజీనామా నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకున్నది కాదని వివరణ
- మీడియాతో అన్నీ చెప్పుకోలేమని వ్యాఖ్య
ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని జగన్ తో మాట్లాడగా.. క్షణం కూడా ఆలోచించకుండా కుదరదని చెప్పేశారని మోపిదేవి తెలిపారు. అది తనకు అసంతృప్తి కలిగించిందన్నారు. నేటి రాజీనామా నిర్ణయానికి ఆ క్షణంలోనే బీజం పడిందని వివరించారు. అయితే, అధిష్ఠానంలో మార్పు వస్తుందేమోనని ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో రాజీనామా చేయాల్సి వస్తోందన్నారు. కాగా, గురువారం మధ్యాహ్నం మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేయనున్నట్లు సమాచారం.