పెళ్లిళ్ల సీజన్‌లోనూ ఒడిదొడుకులు.. పెరగడానికి బదులు తగ్గుతున్న బంగారం ధర
- హైదరాబాద్ మార్కెట్లో నేడు స్వల్పంగా రూ. 10 తగ్గిన పుత్తడి ధరలు
- గత కొన్ని వారాలుగా బంగారం ధరల్లో ఊగిసలాట
- 24 కేరెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,030గా నమోదు
తాజాగా హైదరాబాద్ మార్కెట్లో నేడు పది గ్రాముల బంగారం ధర చాలా స్వల్పంగా రూ. 10 తగ్గింది. ఫలితంగా 24 కేరెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 73,030గా ఉండగా, 22 కేరెట్ల పుత్తడి ధర రూ. 66,940గా ఉంది. వెండి ధర కిలో రూ. 92,800గా నమోదైంది. ఈ ధరలు ఈ ఉదయం 8 గంటలకు నమోదైనవి మాత్రమే. సాధారణంగా బంగారం ధరలు క్షణక్షణానికి మారుతుంటాయి కాబట్టి కొనుగోలు సమయంలో విచారణ తప్పనిసరి.