రేపు కవిత బెయిల్ పిటిషన్‌పై కోర్టులో విచారణ
- రేపు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై విచారణ
- కవిత తరఫున వాదనలు వినిపించనున్న ముకుల్ రోహత్గీ
- ఢిల్లీకి బయలుదేరిన కేటీఆర్, హరీశ్ రావు
జైల్లో ఉన్న కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఈ నెల 22న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భర్త అనిల్ సమక్షంలో పరీక్షలు నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు జైలుకు తరలించారు. అంతకుముందు, జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స అందించారు.