156 రకాల మందులను కేంద్రం నిషేధించింది .. అవి ఏమిటంటే.!
- నిషేధించిన మందుల్లో ఎక్కువగా జ్వరం, జలుబు, నొప్పులు, ఎలర్జీకి వాడే ఔషధాలు
- ఈ కాంబినేషన్ డ్రగ్స్ వాడటం ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుందన్న కేంద్రం
ఎసెక్లోఫెనాక్ 500 ఎంజీ + పారాసెటమాల్ 125 ఎంజీ టాబ్లెట్ లను; మెఫెనమిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్; సెట్రిజెన్ హెచ్‌సీఎల్ + పారాసెటమాల్ + ఫినైలెఫ్రెన్ హెచ్‌సీఎల్; లెవొసెట్రిజిన్ + ఫినైలెఫ్రెన్ హెచ్‌సీఎల్ + పారాసెటమాల్ వంటివి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిషేదిత మందుల జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు ఈ నెల 12న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సురక్షితమైన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉండగా, ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) మందులను వాడటం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని అందులో పేర్కొన్నారు.