ఇంటి బయట మాట్లాడుకుంటున్న యువకులపై పడిన ఏసీ యూనిట్.. ఒకరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం.. వీడియో ఇదిగో!
- ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఘటన
- స్కూటర్‌పై కూర్చుని స్నేహితుడితో మాట్లాడుతుండగా నెత్తిపై పడిన ఏసీ యూనిట్
- తన తప్పేమీ లేదని. కోతుల పనేనన్న యజమాని
- చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న యువకుడు ఆయన కుమారుడే
ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ ఘటనలో తన తప్పేమీ లేదని, అంతా కోతుల పనేనని రెండో అంతస్తులో ఉండే ఏసీ యజమాని చెబుతున్నాడు. ఈ ప్రాంతంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. కింద మనుషులు ఉండడంతో ఏసీపైకి ఎక్కిన కోతులు దానిని పట్టుకుని వేలాడడంతో అది పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రన్షు ఆయన కుమారుడే!