TTD: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ఇదిగో!

TTDs gearing up for srivari navahnika salakatla brahmotsavams
షార్ట్స్‌లో చూడండి
తిరులమ శ్రీ వారి ఆలయంలో వైభవంగా జరిగే నహహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ ను టీటీడీ సోమవారం విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకూ ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకూ, సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకూ వాహన సేవలు నిర్వహిస్తారు. 

వాహన సేవల వివరాలు ఇలా..

4-10-2024 – సాయంత్రం 5.45 గంటల నుండి 6 గంటల వరకూ ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనం 
5-10.2024 – ఉదయం 8 గంటలకు చిన్న శేషవాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
6-10.2024 – ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.
7-10.2024 – ఉదయం 8 గంటలకు కల్ప వృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకూ స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం.
8-10.2024 – ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 11.30 గంటల వరకూ గరుడ వాహనం. 
9-10.2024 – ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటల నుండి స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం
10-10.2024 – ఉదయం 8 గంటలకు సూర్య ప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం.
11-10.2024 – ఉదయం 7 గంటలకు రధోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం.
12-10.2024 – ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకూ చక్ర స్నానం, రాత్రి 8.30 గంటల నుండి 10.30 గంటల వరకూ ధ్వజావరోహణం
Go Back to Shorts
TTD
Tirumala
salakatla Brahmotsavams

More Telugu News