ఇవాళ్టి నుంచే తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజిస్ట్రేషన్
- ఉదయం 10 గంటల నుంచి రేపు ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవా, దర్శన టికెట్ల రిజిస్ట్రేషన్‌కు అవకాశం
- టికెట్లు పొందినవారు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా డబ్బు చెల్లింపునకు అవకాశం
- ఇతర సేవల టికెట్ల రిజిస్ట్రేషన్ వివరాలను కూడా వెల్లడించిన టీటీడీ
24న ప్రత్యేక దర్శనం టికెట్లు..
24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఉదయం 10 గంటల నుంచి బుకింగ్ ప్రారంభమవుతుందని టీటీడీ తెలిపింది. అదే రోజు వసతి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్టు పేర్కొంది. తిరుమల, తిరుపతి శ్రీవారి స్వచ్ఛంద సేవా జనరల్ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్టు పేర్కొంది. అయితే అంతకంటే ముందు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, వసతి గదుల కోటాను విడుదల చేయనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఇక అదే రోజున ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లు విడుదల అవుతాయని తెలిపింది.