Rakesh Pal: కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ చెన్నైలో హఠాన్మరణం

Coast Guard DG Rakesh Pal dies of heart attack
షార్ట్స్‌లో చూడండి
భారత తీర ప్రాంత రక్షక దళం (ఇండియన్ కోస్ట్ గార్డ్) డైరెక్టర్ జనరల్ రాకేశ్ పాల్ హఠాన్మరణం చెందారు. రాకేశ్ పాల్ చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. 

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన కోసం ఐఎన్ఎస్ అడయార్ లో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా, ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దాంతో ఆయనను హుటాహుటీన చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన మృతి చెందినట్టు నిర్ధారించారు. చికిత్సకు ఆయన శరీరం స్పందించలేదని వైద్యులు తెలిపారు. 

రాకేశ్ పాల్ మృతి పట్ల కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం తెలియజేశారు. రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో రాకేల్ పాల్ భౌతికకాయానికి వారు నివాళులు అర్పించారు.
Go Back to Shorts
Rakesh Pal
Demise
Heart Attack
Chenni
Coast Guard

More Telugu News