లంచం సొమ్ము పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. వీడియో ఇదిగో!
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- ముగ్గురినీ సస్పెండ్ చేస్తూ ఎల్జీ వీకే సక్సేనా ఆదేశాలు
- శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వరకు చేరింది. దీంతో ఆయన సీరియస్ గా స్పందించారు. వెంటనే సదరు ట్రాఫిక్ సిబ్బంది ముగ్గురినీ సస్పెండ్ చేశారు. వారిపై డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ‘లంచం నోట్లు పంచుకుంటూ కెమెరాకు చిక్కిన ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లు, ఓ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశాం. ప్రాథమిక విచారణ తర్వాత వారిపై చర్యలు తీసుకున్నాం. వారిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాం’ అంటూ ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ట్విట్టర్ లో పేర్కొన్నారు.