వైద్యుల బదిలీలపై విమర్శలు... వెనక్కి తగ్గిన బెంగాల్ సర్కారు

Bengal govt withdraws Doctors transfer orders
  • ఇవాళ 42 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ బెంగాల్ సర్కారు ఉత్తర్వులు
  • డాక్టర్లు నిరసనల్లో పాల్గొన్నందుకే బదిలీ వేటు వేశారంటూ విమర్శలు
  • ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నట్టు బెంగాల్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడి 
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇవాళ 42 మంది డాక్టర్లను బదిలీ చేయడం విమర్శలకు దారితీసింది. జూనియర్ డాక్టర్ పై హత్యాచారం ఘటనకు వ్యతిరేకిస్తూ నిరసనల్లో పాల్గొన్నందునే ఆ డాక్టర్లను బదిలీ చేశారంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో, బెంగాల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండడంతో, ఆ డాక్టర్ల బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. 

బెంగాల్ ఆరోగ్య శాఖ కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్ స్పందిస్తూ... ఈ బదిలీలకు, హత్యాచార నిరసనలకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ నోటిఫికేషన్ లో పేర్కొన్న బదిలీలకు సంబంధించిన ప్రక్రియ రెండు నెలల కిందటే ప్రారంభమైందని వెల్లడించారు. 

వైద్యుల పేర్లలో అక్షర దోషాల కారణంగా బదిలీ ప్రక్రియ ఆలస్యమైందని తెలిపారు. ఇప్పుడా బదిలీ నోటిఫికేషన్ ను వెనక్కి తీసుకుంటున్నామని నారాయణ్ స్వరూప్ నిగమ్ చెప్పారు.
Go Back to Shorts
Doctors
Transfer
Bengal Govt

More Telugu News