ఈ దేశానికి వెళ్లాలంటే ఇప్పుడు రెండు వారాల్లోనే వీసా
- జర్మనీలో ఉద్యోగం కోసం వెళ్లే వారికి శుభవార్త
- వర్క్ వీసా ప్రాసెస్ ను రెండు వారాలకు తగ్గించనున్న జర్మనీ
- నైపుణ్యం కల్గిన కార్మికులు తక్షణం అవసరమని తెలిపిన జర్మనీ
ఈ నేపథ్యంలో తమ దేశానికి నైపుణ్యం కలిగిన కార్మికులు తక్షణం అవసరమని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్ బాక్ వెల్లడించారు. ఈ డిమాండ్ ను పరిష్కరించడానికి వీసాల ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. జర్మన్ ఎకనామిక్ ఇన్ స్టిట్యూట్ 2023 డేటా ప్రకారం జర్మనీలో దాదాపు 6 లక్షల ఖాళీలు ఉన్నాయి. దీంతో భారతీయుల దీర్ఘకాలిక వీసాలకు త్వరలో ఆమోదం తెలుపుతామని జర్మనీ తెలిపింది. వర్క్ వీసా ప్రాసెసింగ్ ను ఇప్పుడు కేవలం రెండు వారాలకు తగ్గించనున్నారు.
కాగా, భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ రెండు రోజుల క్రితం జర్మన్ ఎంపీలు జుర్గెన్, రాల్ప్ బ్రింకాస్ లతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. డిల్లీలో జుర్గెన్ హార్డ్, రాల్ఫ్ బ్రింకాస్ లతో తాను చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.