ఏపీలో అన్న క్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari donates Rs 1 crore to Anna Canteens
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో రేపు (ఆగస్టు 15) స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. తాజాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థాంగి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం అందించారు. తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఆమె ఈ విరాళం ఇచ్చారు. మంత్రి నారాయణ, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు నారా భువనేశ్వరి విరాళం తాలూకు చెక్ అందించారు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి స్పందిస్తూ, అన్నపూర్ణ వంటి రాష్ట్రంలో ఆకలి అనే పదం వినిపించకూడదని పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమం అన్న క్యాంటీన్లు అని వివరించారు. 
Go Back to Shorts
Nara Bhuvaneswari
Anna Canteens
Donation
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News