ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న బలగాలపైకి కాల్పులు.. ఆర్మీ కెప్టెన్ వీరమరణం
- జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదుల కదలికలు
- దోడా జిల్లాలో కార్డన్ సెర్చ్ చేపట్టిన సైనికులు
- కాల్పులు జరిపి పారిపోయిన టెర్రరిస్టులు
ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ ఒకరు చనిపోయారని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, మరణించిన కెప్టెన్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ ఘటనలో గాయపడ్డ పౌరుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. దోడా జిల్లాలో కార్డన్ సెర్చ్ కొనసాగుతోందని, ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించామని తెలిపారు. అప్పటికే అక్కడి నుంచి టెర్రరిస్టులు పారిపోయారని చెప్పారు. ఆ స్థావరం నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇందులో అమెరికాలో తయారైన ఎం4 అసాల్ట్ రైఫిల్ కూడా ఉందని పేర్కొన్నారు.