ఏపీ, తెలంగాణ సహా ఆ రాష్ట్రాలకు వర్ష సూచన
- రానున్న 24 గంటల్లో 17 రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
- ఢిల్లీలో ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు
- ఆగస్టు 18వరకూ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో భారీ వర్షాలు
రేపు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఆగస్టు 15న కర్ణాటక, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జార్ఖండ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జమ్ము, హర్యానా, చత్తీస్ గఢ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 18వరకూ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లలో భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఆగస్టు 16వరకూ హర్యనాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.