ఐరోపాలోని అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రంలో మంటలు.. ఉక్రెయిన్ పనే అంటున్న రష్యా.. వీడియో ఇదిగో!
- ఉక్రెయిన్ దాడుల్లో జపోరిజియా అణు విద్యుత్తు కేంద్రంలో మంటలు
- కమికాజ్ ట్రోన్‌తో ఉక్రెయిన్ దాడిచేసిందన్న రష్యా
- తమకు సంబంధం లేదన్న ఉక్రెయిన్
- న్యూక్లియర్ టెర్రర్‌ను రెచ్చగొట్టేందుకు రష్యానే ఆ పని చేసిందని ఆరోపణ
అగ్ని ప్రమాదం కారణంగా కూలింగ్ సిస్టం వద్ద నష్టం వాటిల్లినప్పటికీ ప్లాంట్ కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకమూ కలగలేదని పవర్ ప్లాంట్ డైరెక్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ యెవ్‌జీనియా యషీనా తెలిపారు. ఉక్రెయిన్ దాడుల కారణంగా ప్లాంట్‌కు మంటలు అంటుకున్నట్టు జపోరిజియా ప్రాంత గవర్నర్ యెవ్‌గెనీ బాలిట్‌స్కీ ఆరోపించారు. అయితే, ఉక్రెయిన్ మాత్రం ‘న్యూక్లియర్ టెర్రర్’ను రెచ్చగొట్టేందుకు రష్యానే ఉద్దేశపూర్వకంగా ప్లాంట్‌ను ధ్వంసం చేస్తోందని ఆరోపించింది.