కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే గడ్డుకాలం: కేటీఆర్
- ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందన్న కేటీఆర్
- సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభం అంటూ మండిపాటు
- కాంగ్రెస్ పాలనలో రైతులకు భరోసానే లేకుండా పోయిందని ఆవేదన
సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభం అని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు భరోసానే లేకుండా పోయిందన్నారు. రుణమాఫీ అని మభ్య పెట్టి పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ అని తెలిపారు. బురద రాజకీయాలు తప్ప సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం మాటలు కోటలు దాటుతున్నయ్, కానీ చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు అంటూ ట్వీట్ చేశారు.