బీజేపీ, జేడీఎస్ నేతలు వచ్చే 6 నెలల్లో జైలుకే: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే
- బీజేపీ పాలనలో అక్రమాలపై విచారణ జరుపుతున్నామని వెల్లడి
- సగం మంది జైలులో.. సగం మంది బెయిలుపై ఉంటారని వ్యాఖ్య
వాటి ఆధారంగా చర్యలు తీసుకోబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ద్వారా అస్థిర పరిచేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ఎవరో ఫిర్యాదు చేస్తే తమ పార్టీ నేతలకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన గవర్నర్.. మాజీ మంత్రి మురుగేశ్ నిరాణిపై ఫిర్యాదు చేస్తే మాత్రం సైలెంట్ గా ఉన్నారని మండిపడ్డారు. గవర్నర్‌కు ఎక్కడి నుంచో సూచనలు అందుతున్నాయని, వాటి ప్రకారమే ఆయన నడుచుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే గవర్నర్లను కోర్టులు మందలించే స్థితి ఏర్పడిందని మంత్రి చెప్పారు.