పెళ్లైన రోజే విగతజీవులైన ప్రేమజంట.. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ.. కత్తిపోట్లతో మృతి
- ప్రేమించుకొని.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఇరువురు
- వివాహమైన రోజే నవ దంపతుల మధ్య ఘర్షణ
- కర్ణాటకలో కత్తి పోట్లతో నవదంపతులు నవీన్, లిఖిత మృతి
- ఘటనను జీర్ణించుకోలేపోతున్న ఇరు కుటుంబాలు
ఆ సాయంత్రం లిఖితతో పాటు ఆమె తల్లిదండ్రులను అదే గ్రామంలో ఉన్న తన బంధువులను నవీన్ తన ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో నూతన దంపతులు ఘర్షణ పడ్డారు. ఆ వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో లిఖితపై నవీన్ కత్తితో దాడి చేశాడు. గదిలో నుంచి పెద్దగా అరుపులు వినపడడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లి చూసి నిర్ఘాంతపోయారు. లిఖిత అప్పటికే రక్తపు మడుగులో పడి మృతి చెందగా నవీన్ కూడా తీవ్ర గాయాలపాలై పడి ఉన్నాడు.
వెంటనే కుటుంబ సభ్యులు నవీన్‌ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం అతడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమించి ఇష్టపూర్వకంగా వివాహం చేసుకున్న నవ దంపతులు కాళ్ల పారాణి ఆరకముందే ఘర్షణ పడి మృతి చెందడాన్ని ఇరు కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. వధువు లిఖితపై కత్తితో దాడి చేసిన వరుడు నవీన్.. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. అయితే వీరి మధ్య ఘర్షణకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు.