మాన‌వ‌త్వం మ‌రిచిన జ‌నం.. ప్రమాదంలో డ్రైవర్ చనిపోతే పాల కోసం ఎగబడిన వైనం!

People Loot Milk From Tanker That Collided With Truck On UP Highway
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. హైవేపై మిల్క్‌ ట్యాంక‌ర్‌ను వెనుక నుంచి వ‌చ్చిన‌ మ‌రో వాహ‌నం ఢీకొట్టింది. ఈ  ప్ర‌మాదంలో ట్యాంక‌ర్‌ డ్రైవర్ అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. అయితే, స్థానికులు మానవత్వాన్ని మరిచారు. వారి కళ్లముందే మృతదేహం ఉన్నా తమకు పట్టనట్లుగా వ్యవహించారు. 

మిల్క్‌ ట్యాంకర్ నుంచి లీకైన పాలను బాటిళ్లలో పట్టుకునేందుకు ఎగ‌బ‌డ్డారు. ఈ దారుణ ఘటన సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ గా మారింది. ఈ ఘటనపై స్థానికులు వ్యవహరించిన తీరుపట్ల సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కాగా, ప్ర‌మాదంలో చ‌నిపోయిన డ్రైవ‌ర్‌ను ప్రేమ్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.
Go Back to Shorts
Milk Tanker
Road Accident
Uttar Pradesh

More Telugu News