చంద్రబాబుపై పోటీ చేసినందుకే తనపై ఈ దుష్ప్రచారం అంటున్న వైసీపీ ఎమ్మెల్సీ భరత్
- వైసీపీ ఎమ్మెల్సీ భరత్ పై గుంటూరులో కేసు నమోదు
- రాజకీయ కక్షతో తనపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారంటున్న ఎమ్మెల్సీ భరత్
- పూర్తి వివరాలతో త్వరలో మీడియా ముందుకు వస్తానని భరత్ ప్రకటన
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై పోటీ చేయడంతో పాటు అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడ్డానన్న రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని భరత్ ఆరోపించారు. తనను తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేసిన భరత్ ..తనపై ఫిర్యాదు చేసింది ఎవరు.. పోలీసులు కేసులో పేర్కొన్న వ్యక్తులు ఎవరు అనే విషయాలు అన్నీ ఆరా తీస్తాననీ, పూర్తి వివరాలతో త్వరలో మళ్లీ మీడియా ముందుకు వస్తానని తెలిపారు.