కారుతో మైనర్‌ బాలుడి స్టంట్‌... స్కూటర్‌ను ఢీకొట్టడంతో మహిళ మృతి... ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం!

Kanpur Teen Car Stunt Goes Wrong Woman Crushed Daughter Critical
  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘ‌ట‌న‌
  • 17 ఏళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి కారు డ్రైవింగ్‌ 
  • మితిమీరిన వేగంతో కారు న‌డిపి.. అదుపుచేయ‌లేక స్కూటర్‌ను ఢీకొట్టిన వైనం
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ మైన‌ర్ బాలుడు చేసిన కారు స్టంట్ మ‌హిళ ప్రాణాలు తీసింది. స‌ద‌రు బాలుడు కారుతో స్టంట్ చేయ‌గా, అదుపుతప్పిన ఆ కారు ఒక స్కూటర్‌ను ఢీకొట్టింది. దాంతో స్కూట‌ర్ డ్రైవ్‌ చేసిన మహిళ చ‌నిపోగా, ఆమె కుమార్తె గాయపడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో ఇప్పుడు నెట్టింట‌ వైరల్ అవుతోంది.  

వివ‌రాల్లోకి వెళితే.. శుక్రవారం నాడు 17 ఏళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి కారు డ్రైవ్‌ చేశాడు. ఈ సందర్భంగా బిజీ రోడ్డులో కారుతో స్టంట్‌ చేశాడు. వంద కిలోమీటర్ల వేగంతో కారును అడ్డంగా నడిపాడు. దాంతో అదుపుతప్పిన కారు అదే స‌మ‌యంలో అటుగా వ‌స్తున్న‌ స్కూటర్‌పైకి దూసుకెళ్లింది. 

దాంతో... ఆ స్కూటర్‌ను డ్రైవ్‌ చేసిన మహిళ, వెనుక కూర్చొన్న ఆమె కుమార్తె గాలిలోకి ఎగిరిపడ్డారు. త‌ల్లికూతురు ఇద్ద‌రికి తీవ్ర గాయాలు కావ‌డంతో స్థానికులు వెంట‌నే ఆసుపత్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మ‌హిళ చ‌నిపోయింది. 12 ఏళ్ల కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న కాన్పూర్‌ పోలీసులు మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.
Go Back to Shorts
Kanpur
Car Stunt
Uttar Pradesh

More Telugu News