మీరు బూతులు తిట్టినా... నిలదీస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం: కేటీఆర్
- తమకు పోరాటం కొత్త కాదన్న కేటీఆర్
- ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేశారని ఆగ్రహం
- అవసరమైతే ఢిల్లీకి వచ్చి ఎండగడుతామని హెచ్చరిక
తెలంగాణ యువతను మోసం చేస్తున్న ఈ విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని ఎండగడుతామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టేది లేదని, తమను తిట్టినా ప్రశ్నిస్తుంటామనీ, నిలదీస్తామనీ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా తన అరెస్టుకు సంబంధించిన ఫొటోను కేటీఆర్ షేర్ చేశారు.