ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం.. రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం
- గోషామహల్ పోలీస్ క్వార్టర్స్‌లో 30 ఎకరాల స్థలంలో నిర్మాణం
- ప్రస్తుతం ఉన్న భవనాన్ని హెరిటేజ్ భవనంగా మార్చాలని నిర్ణయం
- శాసనసభలో ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి
2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా 26 ఎకరాల స్థలంలో ఉన్న ఆసుపత్రిని కూల్చివేసి దాని స్థానంలో కొత్తది నిర్మిస్తామని ప్రకటించారు. వారసత్వ భవనాల కూల్చివేత సరికాదంటూ చరిత్రకారులు కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం స్టే విధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించింది. కాగా, ప్రస్తుతం ఉన్న భవనాన్ని 1919లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిర్మించారు.