రేవంత్‌రెడ్డిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల.. కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టీకరణ
- ఇటీవల బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
- తిరిగి బీఆర్ఎస్‌లోకి వెళ్తారని ప్రచారం
- జూపల్లి బుజ్జగింపులతో మెత్తబడిన ఎమ్మెల్యే
ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలోనూ కలవరం రేపింది. పార్టీలో బండ్లకు సముచిత స్థానం కల్పించకపోవడం వల్లే ఆయన పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు. ఈ నేపథ్యంలో నిన్న రేవంత్‌రెడ్డిని కలిసి బండ్ల కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.