విన్నపాలపై ప్రతివారం సమీక్షించి చర్యలు తీసుకుంటాం: ఏపీ హోం మంత్రి అనిత
తాజాగా ఆమె అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఆమె ట్వీట్ చేశారు. పాయకరావుపేటలోని తన స్వగృహంలో నిన్న ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరిగిందని, ఆయా విన్నపాలను శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతోందని తెలిపారు.
ప్రజల అర్జీలు ఎంత మేరకు పరిష్కారం అయ్యాయి... వాటి స్టేటస్ ఏమిటి? అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆయా విన్నపాలపై ప్రతి వారం సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.