బస్సు నుంచి రూ. 3 కోట్ల విలువైన బంగారు నగల చోరీ
- హైదరాబాద్ నుంచి ముంబై బయలుదేరిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు
- అర్ధరాత్రి సంగారెడ్డి జిల్లా సత్వార్ వద్ద ఆగిన బస్సు
- ప్రయాణికుల్లా బస్సెక్కి బ్యాగుతో పరారైన దొంగలు
చోరీపై అనుమానా లు.. పొంతనలేని వ్యాపారి సమాధానాలు
దాదాపు రూ. 3 కోట్ల విలువైన నగలున్న బ్యాగ్ పోగొట్టుకున్న వ్యాపారి ఫిర్యాదు సమయంలో తడబాటుకు గురికావడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు కిలోల ఆభరణాలు ఎత్తుకెళ్లారని ఒకసారి, మొత్తం బ్యాగునే ఎత్తుకెళ్లారని మరోసారి వ్యాపారి చెప్పినట్టు పోలీసులు తెలిపారు. ఆ నగలకు సంబంధించిన పూర్తి బిల్లు కావాలని కోరడంతో వ్యాపారి హైదరాబాద్ వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, 2019లో ఇదే దాబా వద్ద ఇలానే ఓ వ్యాపారి నుంచి రూ. 1.50 కోట్ల నగదు చోరీ అయింది.