147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. కనీవినీ ఎరుగని చెత్త రికార్డ్ నమోదు
- ఐర్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఏకంగా 42 బై రన్స్ ఇచ్చిన జింబాబ్వే వికెట్ కీపర్ క్లైవ్ మదండే
- సొంత తప్పిదాలతో పాటు బౌలర్ల పొరపాటుతో అవాంఛిత రికార్డు నమోదు
- 1934లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ నెలకొల్పిన 37 బై రన్స్ రికార్డు బ్రేక్
1934లో ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ కీపర్ లెస్ అమెస్ చేజార్చిన 37 బై రన్స్ వికెట్ కీపర్ చెత్తరికార్డుగా ఉండేవి. ఆ రికార్డును మదండే బ్రేక్ చేశాడు. కాగా క్రికెట్ హిస్టరీలో అత్యుత్తమ వికెట్ కీపర్లలో లెస్ అమెస్ ఒకడు కావడం విశేషం.
కాగా జింబాబ్వే తొలుత బ్యాటింగ్ చేసి 210 పరుగులకు ఆలౌట్ అయింది. ఐర్లాండ్ 250 పరుగులు చేయడంతో ఆ జట్టుకు 40 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ 40 పరుగులు కీపర్ సమర్పించిన బైరన్స్‌తో సమానం కావడం గమనార్హం. ఇక 24 ఏళ్ల క్లైవ్ మదండే బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయాడు. డకౌట్‌గా పెవీలియన్‌కు చేరి నిరాశపరిచాడు.