ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- ముంబై పరిధిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన అధికారులు
- పరిస్థితిని సమీక్షించిన ఉపముఖ్యమంత్రులు ఫడ్నవీస్, అజిత్ పవార్
- కొంకణ్‌లో భారీ వర్షం కురవవచ్చునని వాతావరణ శాఖ వెల్లడి
ఈరోజు మధ్య మహారాష్ట్రలోని కొంకణ్‌లో అత్యంత భారీ వర్షపాతం కురవవచ్చునని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ముంబైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈరోజు ఆర్థిక రాజధానికి రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. దీంతో పాటు ఈరోజు థానే, పాల్ఘర్, పూణే, కొల్హాపూర్, సతారా, రాయ్‌గఢ్, రత్నగిరిలో ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేశారు.