అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నాక బైడెన్ తొలి ప్రసంగం!
- శ్వేత సౌధంలో జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్
- దేశాన్ని, పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్టు ప్రకటన
- యువతకు బాధ్యతలు అప్పజెప్పేందుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్య
ప్రసంగ సమయంలో బైడెన్ భార్య జిల్, కూతురు ఆశ్లే ఆయన వెంట ఉన్నారు. ఆ తరువాత జిల్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. బైడెన్‌కు నిరంతరంగా మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక తప్పుకోవడంతో అమెరికా రాజకీయాల్లో అత్యంత వృద్ధ నేతగా ట్రంప్ నిలిచారు. ఇక, బైడెన్ స్పీచ్ అనంతరం, ట్రంప్ ఆయనపై విరుచుకుపడ్డారు. బైడెన్ ప్రసంగం అర్థరహితంగా ఉందని మండిపడ్డారు. మరోవైపు, అమెరికాలో అధికార మార్పిడి తప్పదన్న సంకేతాల నడుమ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బైడెన్‌తో గురువారం సమావేశం కానున్నారు. అనంతరం, ఆయన కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్‌తో కూడా సమావేశం అవుతారు.