KCR: నా కూతురును కక్షతో జైల్లో పెట్టారు.. తండ్రిగా నాకు బాధ ఉండదా?: కేసీఆర్

KCR about daughter kavitha
షార్ట్స్‌లో చూడండి
రాజకీయ కక్షతోనే తన కూతురు కవితను జైల్లో పెట్టారని... కూతురు జైల్లో ఉంటే తండ్రిగా తనకు బాధ ఉండదా? అని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తాను అగ్నిపర్వతంలా ఉన్నానన్నారు. తమ పార్టీకి ఎలాంటి క్లిష్ట పరిస్థితులూ లేవన్నారు. ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితులను కూడా తాము ఎదుర్కొన్నామన్నారు.

చాలా క్లిష్టపరిస్థితుల్లో తెలంగాణను సాధించుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పాలనపై పట్టు సాధించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు పాలనపై దృష్టి సారించకుండా బద్నాం చేసే పనిలో ఉన్నారని విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
KCR
K Kavitha
Telangana

More Telugu News