ఢిల్లీకి బయలుదేరిన వైఎస్ జగన్.. రేపు దేశరాజధానిలో ధర్నా
- మూడు రోజులపాటు ఢిల్లీలోనే జగన్ మకాం
- ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్మును కలిసి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు
- జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ, జనసేన విమర్శలు
మరోపక్క, జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ, జనసేన తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. చర్చల నుంచి తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు ఆయన ఇష్టపడడం లేదని విమర్శించాయి.
నిన్న ఎమ్మెల్యేలతో కలిసి నల్లకండువాలతో సభకు హాజరైన జగన్.. ఆపై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేస్తూ అసెంబ్లీని వాకౌట్ చేశారు. ఏపీలో అరాచక పాలన జరుగుతోందని, నెలన్నర రోజులుగా రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాకస్థాయికి చేరాయని ఆరోపించారు.