అమెజాన్ అడవుల్లో అరుదైన తెగ.. తొలిసారి వెలుగులోకి వచ్చిన ఫొటోలు, వీడియో ఇవిగో!

Rare footage tribe emerging from Amazon came to light
  • పెరువియన్ అమెజాన్‌లో సంచరిస్తున్న మాష్కో పైరోగా గుర్తింపు
  • బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని అతిపెద్ద స్వదేశీ సమూహం ఇదే
  • ఆహారం కోసం అన్వేషిస్తూ లాస్ పీడ్రాస్ నది తీరానికి
అమెజాన్ అడవుల్లో సంచరించే అరుదైన తెగకు సంబంధించిన ఫొటోలు, వీడియో తొలిసారి వెలుగులోకి వచ్చాయి. పెరువియన్ అమెజాన్‌లో సంచరిస్తున్న ఈ తెగను మాష్కో పైరోగా గుర్తించారు. సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ ఈ ఫొటోలను విడుదల చేసింది. 

బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా నివసించే గిరిజన తెగల్లో ఇదే అతిపెద్దదని చెబుతున్నారు. పెరు సమీపంలోని Las Piedras River లాస్ పీడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తూ కనిపించారు. ఈ ప్రాంతంలో మాష్కో పైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనామడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు. 

ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా లాంగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు. మారుమూల గ్రామాలైన మోంటే సాల్వడో, ప్యూర్టో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఈ తెగవారు బయటకు రావడంతో స్థానికులకు, వారికి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Mashco Piro Tribee
Peru
Las Piedras River
Survival International
Amazon Forests

More Telugu News