శరీరాకృతిపై ఆఫీసులో వేధింపులు.. బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య
- ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘాజియాబాద్ వాసి శివానీ
- శరీరాకృతి, దుస్తులు, మాటతీరు బాలేదంటూ తోటి ఉద్యోగులు వేధించేవారని సూసైడ్ నోట్
- లేఖలో ఐదుగురు ఉద్యోగుల ప్రస్తావన, వారికి మరణశిక్ష విధించాలని డిమాండ్
శివానీ కార్యాలయంలో పనిచేసే తోటి మహిళా ఉద్యోగి తన సోదరిని సూటిపోటి మాటలు, వెక్కిరింతలతో వేధించేదని ఆమె సోదరుడు మీడియాకు తెలిపారు. ఓసారి ఆమె శివానీపై దాడికి దిగితే ఆమె తిరిగి చెంపపగలగొట్టిందని అన్నారు. తాను చాలా సార్లు రిజైన్ చేద్దామని అనుకున్నా, కంపెనీ వారు ఏదో కారణంతో ఆమె ప్రయత్నాన్ని తిప్పికొట్టేవారని చెప్పాడు. చెంప దెబ్బ ఘటన తరువాత శివానీకి టెర్మెనేషన్ నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఈ ఘటన ఆమెపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఆఫీసులో వేధింపులపై శివానీ పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, చర్యలు తీసుకోలేదని ఆమె సోదరుడు ఆరోపించాడు.