సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన జస్టిస్ నరసింహారెడ్డి
- ఇప్పటి వరకు ప్రతి కమిషన్ ప్రెస్ మీట్ పెట్టిందన్న నరసింహారెడ్డి
- తాను ప్రెస్‌మీట్‌లో ఎలాంటి అంశాలను బయటపెట్టలేదని వెల్లడి
- కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ ప్రెస్ మీట్లు పెడుతుందని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడుతూ... ఈ వివాదానికి తన ప్రెస్ మీట్ కారణమని చెబుతున్నారని... కానీ ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టకుండా ఉన్న ఒక్క విచారణ కమిటీనైనా చూపించాలన్నారు. షా కమిషన్ వంటివి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాయన్నారు.
సుప్రీంకోర్టు ప్రాథమిక వాదోపవాదనలు మాత్రమే విన్నదని పేర్కొన్నారు. ఇంకాస్త లోతుగా విచారించి ఉంటే తాను ప్రెస్ మీట్‌లో అభిప్రాయం చెప్పానో లేదో తెలిసేదన్నారు. తన ప్రెస్‌మీట్‌లో ఎలాంటి అంశాలను బయటపెట్టలేదన్నారు. లోతైన విచారణ వద్దని కోర్టు భావించినట్లుగా ఉందన్నారు. తాను మాత్రం అభిప్రాయం చెప్పలేదన్నారు.
అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పుపై తాను ఎలాంటి కామెంట్ చేయదల్చుకోలేదన్నారు. అయితే కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ ప్రెస్ మీట్లు పెడుతుందని తాను ఇప్పటికీ చెబుతున్నానన్నారు. కమిషన్ అంటేనే ఓపెన్ ఎంక్వయిరీ అని అర్థమని పేర్కొన్నారు. అసలు కమిషన్ ప్రెస్ మీట్లు పెడితే తప్పేమిటన్నారు. ప్రెస్ మీట్లు పెట్టి తాను ఎలాంటి అంశాలు బయటపెట్టలేదన్నారు.