బీఆర్ఎస్ ను వదిలే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే వివేకానంద
- కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్న వివేకానంద
- కడియం శ్రీహరిపై అనర్హత పిటిషన్ వేసింది తానేనని వ్యాఖ్య
- హైడ్రా పేరుతో రేవంత్ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలు పెట్టిందని విమర్శ
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలు పెట్టిందని వివేకానంద విమర్శించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలను తొలగించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. హైడ్రాతో శివారు మున్సిపాలిటీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని వివేకానంద అన్నారు. ఏడు నెలల కాలంలో కొత్త భవనాలకు అనుమతులు ఇవ్వలేదని... దీంతో, రియలెస్టేట్ కుదేలయిందని విమర్శించారు.