పిలవని పేరంటాలు... ఆహ్వానం లేకుండా అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ యువకులపై కేసు
- ముంబయిలో అంగరంగవైభోగంగా అనంత్ అంబానీ పెళ్లి
- ఆహ్వానం లేకుండా పెళ్లికి వెళ్లిన అల్లూరి వెంకటేశ్, షఫీ షేక్
- ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
తాజాగా, అనంత్ అంబానీ పెళ్లికి ఆహ్వానం లేకుండా వెళ్లిన ఇద్దరు ఏపీ యువకులపై కేసు నమోదైంది. వారిద్దరిలో అల్లూరి వెంకటేశ్ అనే యువకుడు యూట్యూబర్. మరో యువకుడి పేరు షఫీ షేక్.
ఈ ఇద్దరు యువకులు ఆహ్వానం లేకుండా అంబానీ ఇంట్లో పెళ్లికి వచ్చారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో వారిద్దరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసుకున్న ముంబయి బీకేసీ పోలీసులు... ఆ ఏపీ యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, నోటీసులు ఇచ్చి వదిలేశారు.