ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది ఐఏఎస్‌ల బదిలీ
- ఇద్దరు ఐపీఎస్ అధికారులనూ బదిలీ చేసిన ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్
- గ్రామ వార్డు సచివాలయం అదనపు బాధ్యతలు సురేశ్ కుమార్‌కు అప్పగింత
ఐటీ శాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శిగా యువరాజ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా హర్షవర్ధన్, వెనుకబడిన తరగతుల సంక్షేమ కార్యదర్శిగా పి.భాస్కర్‌లను బదిలీ చేశారు. పి.భాస్కర్‌కు ఈడబ్ల్యుఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలను అప్పగించారు.
సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా కె.కన్నబాబును బదిలీ చేశారు. ఆయనకు గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌గాను బాధ్యతలు అప్పగించారు.
వినయ్ చంద్‌ను పర్యాటక శాఖ కార్యదర్శిగా, వివేక్ యాదవ్‌ను యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శిగా, సూర్యకుమారిని మహిళా, శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా, సి.శ్రీధర్‌ను ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
జె.నివాస్‌కు ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా, విజయరామరాజుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా, ఢిల్లీరావుకు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. హిమాంశు శుక్లాకు సమాచార, పౌరసంబంధాల శాఖ బాధ్యతలను అప్పగించారు. వ్యవసాయ శాఖ నుంచి హరికిరణ్‌ను బదిలీ చేశారు. గిరిజా శంకర్‌ను ఆర్థిక శాఖ నుంచి రిలీవ్ చేశారు.