ఏ ఆధారాలు లేకుండా ఎలా రాస్తారు?: డెక్కన్ క్రానికల్ వ్యవహారంపై విశాఖ ఎంపీ భరత్
- విశాఖ స్టీల్ ప్లాంట్ పై డెక్కన్ క్రానికల్ లో కథనం
- నిరసన తెలిపేందుకు యత్నించిన టీడీపీ శ్రేణులు
- డెక్కన్ క్రానికల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- డెక్కన్ క్రానికల్ ది బాధ్యతా రాహిత్యం అంటూ భరత్ విమర్శలు
"చంద్రబాబు కానీ, ఇక్కడి ఎంపీగా నేను కానీ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ కానీ, ఎమ్మెల్యేలుగా పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్ కానీ ఎప్పుడైనా ఏమైనా అన్నామా? ఏ ఆధారం లేకుండా ఇంగ్లీషు మీడియా ఆ విధంగా రాయడం బాధ్యతా రాహిత్యం. ఇది చాలామంది జీవితాలతో ముడిపడిన అంశం. అలాంటి తీవ్రమైన విషయాన్ని ఏదో తేలిగ్గా రాసేయడం అంత కరెక్ట్ కాదు. ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై మేం చర్యలు తీసుకుంటాం" అని భరత్ స్పష్టం చేశారు.