జమ్మూకశ్మీర్‌లో జంట ఎన్‌కౌంటర్లు.. నలుగురు టెర్రరిస్టులు హతం
- ఫ్రిస్కల్ చిన్నిగమ్, మోడెర్‌గామ్ గ్రామాల్లో పోలీసుల ఉగ్రవాద ఏరివేత చర్యలు
- భద్రతా దళాలపై ఉగ్రవాదుల కాల్పులు, ప్రతిదాడికి దిగిన సైనికులు
- మొత్తం నలుగురు టెర్రరిస్టులను మట్టుపెట్టిన భద్రతాదళాలు
- అమరులైన ఇద్దరు సైనికులు, ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగుతాయన్న ఐజీ
లష్కర్ ఉగ్రవాదులు దాగున్నారన్న అనుమానంతో భద్రతా దళాలు ఫ్రిస్కల్ చిన్నిగమ్ గ్రామానికి చేరుకున్నాయి. అక్కడ ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమవగా 01 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన హవాల్దార్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాలను కశ్మీర్ ఐజీ వీకే బిర్ధీ సందర్శించారు. ఉగ్రవాద ఏరివేత చర్యలు కొనసాగుతాయని తెలిపారు.