Chegondi Harirama Jogaiah: సినిమాలు చేయడం మానొద్దంటూ పవన్ కల్యాణ్ కు హరిరామ జోగయ్య లేఖ

Harirama Jogaiah suggests Pawan Kalyan not to stop films
  • పవన్ కు శుభాకాంక్షలు తెలిపిన హరిరామ జోగయ్య
  • కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారని ఆశాభావం
  • సగం రోజులు సినిమాలకు కేటాయించాలని సూచన
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించి, డిప్యూటీ సీఎంగా బాధ్యతలను చేపట్టిన సందర్భంగా పవన్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో పరుగులు పెట్టిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాపు సామాజికవర్గం ఆశిస్తున్నట్టు ఐదు శాతం రిజర్వేషన్లను మీ పాలనలో అమలు చేస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. సినిమాలు చేయడం మానొద్దని... సగం రోజులు పాలనకు, సగం రోజులు సినిమాలకు కేటాయించాలని సూచించారు. కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని విన్నవించారు.
Chegondi Harirama Jogaiah
Pawan Kalyan
Janasena

More Telugu News