Chandrababu: చంద్రబాబుతో భేటీ కోసం... ప్రజాభవన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy reaches Praja Bhavan
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు చేరుకున్నారు. కాసేపట్లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు పాల్గొంటున్నారు. ఈ భేటీలో చర్చించేందుకు తెలుగు రాష్ట్రాల అధికారులు పది అంశాల అజెండాను సిద్ధం చేశారు.

ఉపముఖ్యమంత్రితో ముఖ్యమంత్రి భేటీ

చంద్రబాబుతో భేటీ కావడానికి ముందు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ సీఎంతో భేటీ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై వారు మాట్లాడుకున్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సీఎంతో చర్చించే అంశాలపై వారు చర్చించారు.
Chandrababu
Revanth Reddy
Congress
Andhra Pradesh
Telangana

More Telugu News